Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్కెట్ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తేవాలి

మార్కెట్ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తేవాలి

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి 
జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకొని నిరుపయోగంగా ఉన్న నూతన టౌన్ హాల్, నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ ను వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాటిని వెంటనే వినియోగంలోకి తెచ్చే దిశగా సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన టౌన్ హాల్ లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిధులు ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై సంబంధిత పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టౌన్ హాల్లో పెండింగ్ లో ఉన్న ఫర్నిచర్ సామాగ్రి సమకూర్చడం, సౌండ్ ప్రూఫ్ చేయించడం వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ విభాగాలు సమన్వయంతో పనులను వెంటనే పూర్తి చేసి వచ్చే నెల రోజుల లోపు వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో టౌన్ హాల్ నిర్మాణం కోసం రూ. 3.75 కోట్లు మంజూరు అయ్యాయని, అందులో పూర్తయిన పనులు మినహా మిగతా నిధులతో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ సముదాయాన్ని కూడా ఏప్రిల్ ఒకటో తేదీ లోపు వినియోగంలోకి తెచ్చేదిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆదిశగా వెంటనే దుకాణాలను వ్యాపారులకు కేటాయించేందుకు లక్కీ డ్రా ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లాలన్నారు.

దుకాణాలను పొందేందుకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రకటనలు ఇచ్చి తెలియజేయాలన్నారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తరలింపు కోసం నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -