శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్ నాయకులపై బీజేపీ, బీజేవైఎం దాడి అమానుషం : ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-హిమాయత్ నగర్
పాలస్తీనా ప్రజలపై సామ్రాజ్యవాద అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ చేస్తున్న మారణహౌమ దాడులను, మానవ హక్కుల హననాన్ని వెంటనే ఆపి శాంతిని నెలకొల్పాలని ఏఐఎస్‌ఎఫ్ శాంతియుత ఆందోళన చేస్తుంటే బీజేవైఎం, బీజేపీ, సంఘ పరివార్ దుండగులు దాడి చేయడం సిగ్గు చేటని, దాడికి యత్నించిన దుండగులను అరెస్ట్ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఎన్.ఎ.స్టాలిన్ అన్నారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులపై బీజేవైఎం, బీజేపీ, సంఘ పరివార్ దుండగుల దాడిని నిరసిస్తూ ఆదివారం హైదారబాద్ హిమాయత్ నగర్‌లోని ‘వై’ జంక్షన్ వద్ద ఏఐఎస్‌ఎఫ్ జాతీయ సమితి ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాగోల్ బండ్లగూడలోని నవ చేతన విజ్ఞాన కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణా తరగతుల సందర్భంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న మారణకాండను ఆపాలని నవ చేతన విజ్ఞాన కేంద్రం ముందు నిరసన చేపడితే బీజేపీ, బీజేవైఎం, సంఘ పరివార్ దుండగులు నిరసనను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. ప్రపంచ శాంతిని కోరుకునే ఏఐఎస్‌ఎఫ్, వామపక్ష సంఘాలపై విషాన్ని వెదజల్లి ఇబ్బందులకు గురిచేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చూస్తున్నాయని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని యువతలో అమలు చేయాలనే నీచ సంస్కృతికి ఆజ్యం పోస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రతి దాడులకు పాల్పడే ధైర్యం తమకు ఉందని, కానీ సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. దాడికి యత్నించిన బీజేవైఎం, బీజేపీ, సంఘ పరివార్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఆఫీస్ బేరర్స్ అమిత్ హంజా, సంఘ మిత్ర, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు నాసార్ జీ, వైభవ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు బానోతు రఘురాం, గ్యార నరేష్, గ్యార క్రాంతి, సాయికుమార్, ఫణి, ప్రతిక్ష తదితరులు పాల్గొన్నారు.
పాలస్తీనా ప్రజలపై మారణ హౌమాన్ని ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES