చిరంజీవి, వెంకటేష్ వంటి అగ్రకథానాయకుల కలయికలో తొలిసారి రాబోతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మైంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అటు మెగా, ఇటు వెంకీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న ఓ సర్‌ప్రైజ్ అప్‌డేట్‌ని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ను ఈనెల 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే దీనికి సంబంధించిన ప్రోమోను శనివారం రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమో అనౌన్స్‌మెంట్ పోస్టర్ అందర్నీ అలరిస్తోంది. ఈ పోస్టర్‌లో చిరు, వెంకీ ఇద్దరూ స్టయిలీష్ డాన్స్ పోజుల్లో అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్సర్లతో కలిసి పూర్తి సెలబ్రేషన్ వైబ్స్‌ని క్రియేట్ చేశారు. ఈసాంగ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథమ్‌గా మ్యూజిక్ ఛార్ట్స్‌ను షేక్ చేయబోతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా స్టార్ట్ చేయడానికి ఇది పర్‌ఫెక్ట్ సాంగ్ అని చిత్రయూనిట్ తెలిపింది. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
మెగా మాస్ సాంగ్ సందడి షురూ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



