- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: నగదుతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు వెళ్లిన ప్రయాణికుడికి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద భద్రత సిబ్బంది రూ.3.5 లక్షల నగదు గుర్తించారు. దీంతో అతన్ని మెట్రోలో ప్రయాణించడానికి అనుమతించలేదు. రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా రూ.2లక్షల నగదుతో అనుమతిస్తామని చెప్పడంతో.. సదరు వ్యక్తి వెనక్కి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు.
- Advertisement -