Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి..

మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి..

- Advertisement -

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్

ఎస్సీ,ఎస్టీ, బి.సి, మైనారిటీ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై ప్రత్యేక అధికారులు పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో 691 ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో విధులు కేటాయించిన స్పెషల్ ఆఫీసర్స్ ప్రతిరోజూ సంబంధిత పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి, ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం వంట జరుగుతోందో లేదో పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు.

మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలు  విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని ప్రతిరోజు అందించాలన్నారు. ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ మరియు రెసిడెన్షియల్ పాఠశాలలో వంట సరుకులు, కూరగాయలు, నాణ్యతతో  ఉండాలని,వంటగదులు పరిశుభ్రంగా ఉంచడం, తాగునీరు, సక్రమంగా అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -