- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి- నాగుల్ గావ్ మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది అని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా పెద్ద ఎడ్గి నుండి పడంపల్లి మీదుగా నాగుల్ గావ్ కు వరదనీరు భారీగా దిగువకు వెళ్తోంది. నాగోల్ గావ్ బ్రిడ్జిపై నుండి నీరు భారీగా ప్రవహిస్తూ జుక్కల్ వెళ్ళే రోడ్డుపై నాలుగు గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు.
- Advertisement -