Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

- Advertisement -

క్లాత్ మర్చంట్ వర్కర్స్ అసోసియేషన్ మహాసభలో డబ్బికార్
నవతెలంగాణ – మిర్యాలగూడ 

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ద క్లాత్ మర్చంట్ వర్కర్స్ అసోసియేషన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లాత్ మర్చంట్ లో పనిచేసే కార్మికుల చేత యాజమాన్యాలు వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి పది నుంచి 12 గంటలు పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. రోజంతా కష్టపడిన కనీస వేతనం అందక వర్కర్లు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపింగ్ మాల్స్ లో విధులు నిలబడి ఉండాల్సి ఉంటుందన్నారు. దాని వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.  పెరిగిన ధరలతో వేతనాలు సరిపోక సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వచ్చే వేతనం సరిపోక అప్పుల పాలవుతున్నారన్నారు.

కనీసం కార్మికులు సంఘం పెట్టుకునే అవకాశం కల్పించకుండా ఒత్తడికి గురి చేస్తున్నారని చెప్పారు.  క్లాత్ మర్చంట్ వర్కర్స్ కు కనీస వేతనం అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ అమలుచేయాలన్నారు.  కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వర్కర్లు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలు చేయాలన్నారు. కార్మికల పక్షాన సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డబ్బికార్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా దైద దేవయ్య, ఉపాధ్యక్షులుగా రాపోలు శ్రీనివాస్,జె. గురువయ్య, సహాయ కార్యదర్శిగా రఘుకుమార్, వెంకటస్వామి, కోశాధికారిగా సుబ్బారావు లను ఎన్నుకున్నారు .ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వవెంకటేశ్వర్లుజిల్లా సహాయ కార్యదర్శి  డా.మల్లు గౌతంరెడ్డి, హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి, కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు పరు శురాములు, సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్, ఆ యూనియన్ నాయకులు దేవయ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -