Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి గారు మంథనికి చేసింది శూన్యం

మంత్రి గారు మంథనికి చేసింది శూన్యం

- Advertisement -

– కాటారం మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్
నవతెలంగాణ – కాటారం

కాటారం మండలం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆదివారం పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో అయన మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గానికి కానీ కాటారం కు   చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభివృద్ధిపై ఫోకస్ చేయడం మానుకొని తన కార్యకర్తలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారిని దూషించడం కొరకే తయారు చేస్తున్నాడు ఆయన అన్నారు.మంథని నియోజక వర్గంలో చెక్ డ్యాముల వలన అభివృద్ధి జరుగుతుందని పంటలు పండుతాయి అని, మచ్చ సంపద పెరుగుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని, నిర్మించిన చెక్ డ్యామ్లను, శ్రీధర్ బాబు అనుచరులు వారి వక్రబుద్ధితో అక్రమ ధనార్జన ధ్యేయంగా పేల్చివేషారాని ఆయన అన్నారు.  గత ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే ను దూషిస్తూ పబ్బం గడుపుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేస్తున్నరాని దుయ్యాబట్టారు.

 ముఖ్య నాయకులు మాట్లాడుతూ

 కాటారం డివిజన్ కేంద్రంలో చేతనైతే ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇండస్ట్రియల్ కంపెనీ, ఒక కుటీర పరిశ్రమ, ఒకమినీ స్టేడియం, బస్టాండ్లను సైతం నిర్మించాలి వారు అన్నారు.

 కార్యక్రమంలో బారాసా మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్, కాటారం సర్పంచ్ పొంతకాని సడవాలి, ప్రతాప్ గిరి సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు, జక్కు. శ్రావణ్, మానేమ్.రాజాబాపు, చీమల వంశీ, కొండపర్తి రవి, చల్ల శేఖర్, వంగల రాజేంద్ర చారి, అజ్మీరా దేవా, ముక్తి తిరుపతి, గాజుల విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -