– రైతు సమస్యల పరిష్కారంలో విఫలం
– బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ప్రాంత ప్రజలు నమ్మి ఓట్లు వేసి ఎమ్మెల్యే గా గెలిపించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంతన్ని మర్చిపోతునట్లు కనపడుతుందని బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని నాగవరం గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పదవిలో ఉండి ఎంత బీజగా ఉన్న రాత్రి పగల్లో ఎప్పుడు సమయం దొరికిన హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటానని పది రోజులోకో సారి మాత్రమే అధికార పర్యటనలకు వచ్చి పోతునట్లు కనపడుతుందన్నారు.
ప్రజా సేవ చేస్తాను అని గొప్పలు చెప్పుకున్న పొన్నం ప్రభాకర్ ఆ మాటలను నిలుపుకావాలన్నారు. కరీంనగర్ ప్రజల ఎమ్మెలే గా పని చేయడానికి అవకాశం ఇవ్వలేక పోయినా మీ మాటలు నమ్మి హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గా గెలిపించారన్నారు. హుస్నాబాద్ ప్రాంత రైతులు దాదాపు నెల రోజుల పాటుగా యూరియా కోసం కష్టాలు పడుతుంటే కనీసం పట్టించుకునే పరిస్థితి కనపడటలేదన్నారు. ఆభివృద్ధి పనులు కోసం చేసిన శంకుస్థాపన లు శిలాపలుకే పరిమితం అయ్యాయాన్నారు.ఈ మధ్యలో కాలం లో కురిసిన వర్షాలకు రోడ్లు అద్వానంగా మారాయన్నారు. సిద్దిపేట నుoడి హుస్నాబాద్ వరకు ఎన్ హెచ్ పనులు పూర్తి కాలేదన్నారు. పేదోడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇసుక బంగారం ధర పెరుగుతున్నట్టు పెరుగుతుందన్నారు.
ఒక ట్రాక్టర్ ట్రిప్ కు ఏడు వేలు రూపాయల వరకు పెరిగిందన్నారు. ఆరు గ్రామాలు హుస్నాబాద్ మండలం లో ఇంకా విలీనం కాలేదన్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజల కళ గౌరవెళ్లి ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు నీళ్లు అందించేలా చర్యలు చేపట్టలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూక్యా రాజు నాయక్, జెరిపోతుల లక్ష్మణ్, గడ్డి రవీందర్ పాల్గొన్నారు .
ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుస్నాబాద్ ను మరిచిన మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES