Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో రేపు జరిగే మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి 

మండలంలో రేపు జరిగే మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి 

- Advertisement -
  • – మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ 
    నవతెలంగాణ -తాడ్వాయి 

    మండలంలో రేపు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారని, ఇట్టి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లు దేవేందర్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రేపు మంగళవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నూతనంగా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న లబ్ధిదారులకు, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కావున మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -