నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోని అష్టా గ్రామం నుండి విట్టోలి తండవరకు రూ.3.5 కోట్లతో మంజూరైన బిటి రోడ్డు పనులను శుక్రవారం రాత్రి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. 8 కిలో మీటర్ల బీటీరోడ్డు పనులు జరుగుతే రవాణ ఇబ్బందులు తొలుగుతాయని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాలలో రోడ్డు మరమ్మత్తులను దశలవారిగా చేయిస్తానని ఈ సందర్బంగా ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అలాగే మండలంలోని ఎడ్ బిడ్ తాండా, చింత కుంట తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రామరావు పటేల్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ లు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి డీఈఈ సునీల్ కుమార్, నాయకులు రాజేష్ బాబు కిష్టారెడ్డి, లక్ష్మీనారాయణ, నర్సా గౌడ్ ,విజేష్, సతీష్ రెడ్డి , పుప్పాల రాములు,అజయ్ రెడ్డి, గంగాధర్, సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీటి రోడ్డు పనులను ప్రారంభించిన ప్రారంభించిన ఎమ్మెల్యే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



