యూఎస్‌తో భారత్ వాణిజ్య ఒప్పందాల వెనుక ఏమున్నది? : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయోజనాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. ‘భారతదేశం ఏ దేశం నుంచి చమురు కొనాలి, కొనకూడదు అని నిర్దేశించేది ట్రంప్. భారతదేశం రష్యన్ చమురు కొనడాన్ని పూర్తిగా నిలిపివేసి, వెనిజులా నుంచి రూ.45 లక్షల కోట్ల విలువైన చమురును కొనుగోలు చేస్తోంది. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న వాణిజ్య ఒప్పందం వాస్తవమైన తర్వాత, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశానికి ప్రవహిస్తాయి. అమెరికన్ సోయా, పత్తి, మొక్కజొన్న, పాల ఉత్పత్తులు ఇండియాకి వస్తాయి. ఇది దేశ వ్యవసాయరంగాన్ని కుదేలు చేస్తుంది. రైతాంగం మరింత నష్టాలను చవి చూడాల్సి వస్తుంది’ అని ఆయన అన్నారు. ‘ పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించడం సాంప్రదాయం. అయితే, ప్రధాన వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన నిర్ణయాలపై మోడీ, ట్రంప్ తమ సోషల్ మీడియా ఖాతాలతో ప్రపంచానికి తెలియజేశారు. ఎలన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ పార్లమెంటు కంటే పెద్దదా? అనే దానిపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ట్రంప్ ప్రకటన వచ్చిన కొన్ని గంటల తరు వాత కూడా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలు, ప్రతిపక్షాల ఆందో ళనలకు వివరణ ఇవ్వడానికి సిద్ధంగా లేదు’ అని విమర్శించారు. మంగళవారం రాజ్యసభలో జరిగిన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీపీఐ(ఎం) తరపున జాన్ బ్రిట్టాస్ పాల్గొని మాట్లాడారు. మోడీ నిజంగా ‘విశ్వగురువు’ కాదా? అనే సందేహం ఉండేదని, ఎప్‌స్టీన్ ఫైల్‌లో ఆయన పేరు కనిపించడంతో ఆ సందేహం తొలగిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యపై అధికార పార్టీ నుంచి భారీ నిరసన వ్యక్తమైంది. దీని తరువాత, ఆ వ్యాఖ్య రికార్డులో ఉండదని రాజ్యసభ చైర్మెన్ ప్రకటించారు. అమెరికా ప్రయోజనాలకు తలొగ్గి మోడీ ప్రభుత్వం ప్రతి అంశంపై నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. ‘వెనిజులా ఎన్నికైన అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. పాలస్తీనా సమస్యపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు. ఇరాన్‌పై ప్రత్యక్ష దాడి జరిగినప్పుడు అది నిరసన వ్యక్తం చేయలేదు’ అని జాన్ బ్రిట్టాస్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో నిరంతరం కేరళ పట్ల నిర్లక్ష్యంపై ఆయన ధ్వజమెత్తారు. ‘భారతదేశం రాష్ట్రాల యూనియన్ అనేది భావన. కేంద్రం కేరళను రాష్ట్రంగా పరిగణిం చనందున దీనిని ఇలా విస్మరిస్తున్నారా? రేపు ఎయిమ్స్ వస్తుందని కేరళ ప్రజలకు హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి సురేష్ గోపిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం అవమానిస్తోంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దా నాలలో కేంద్రం దేనినీ బడ్జెట్‌లో చేర్చకుండా సురేష్ గోపిని ఎగతాళి చేస్తోంది.’ అని బ్రిట్టాస్ అన్నారు. రాజ్యసభలో హాస్యాస్పదమైన ప్రహసనం చేసిన సి. సదానందన్‌ను జాన్ బ్రిట్టాస్ కూడా తీవ్రంగా విమర్శించారు.
ట్రంప్‌నకు మోకరిల్లిన మోడీ సర్కార్
- Advertisement -
- Advertisement -



