Thursday, October 2, 2025
E-PAPER
Homeసినిమాధన పిశాచి విశ్వరూపం..

ధన పిశాచి విశ్వరూపం..

- Advertisement -

సుధీర్‌ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటి స్తున్న సూపర్‌ నేచురల్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’. ఈ పాన్‌-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్‌ కళ్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హై-ఆక్టేన్‌ విజువల్స్‌, పౌరాణిక ఇతివత్తాలతో ఈ చిత్రం గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ అందించబోతుంది. ఇటీవల రిలీజ్‌ అయిన టీజర్‌ నేషనల్‌ వైడ్‌గా వైరల్‌ అయ్యింది. ఫస్ట్‌ ట్రాక్‌ ‘సోల్‌ ఆఫ్‌ జటాధార’కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి ధన ‘పిశాచి సాంగ్‌..’ రిలీజైంది. సమీరా కొప్పికర్‌ పవర్‌ ఫుల్‌ ట్రాక్‌ కంపోజ్‌ చేశారు. శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్‌ టెర్రిఫిక్‌గా ఉన్నాయి. సాహితీ చాగంటి ఇంటెన్స్‌ వోకల్స్‌తో ఆకట్టుకున్నారు.

ఈ సాంగ్‌లో సోనాక్షి సిన్హా పెర్ఫార్మెన్స్‌ అదిరిపోయింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ సాంగ్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మంచికి-చెడుకి, వెలుగుకి-చీకటికి, మానవ సంకల్పానికి-విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతోంది అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. జీ స్టూడియోస్‌, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్‌ కుమార్‌ బన్సల్‌, శివిన్‌ నారంగ్‌, అరుణ అగర్వాల్‌, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్‌, నిఖిల్‌ నందా నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్‌, కుస్సుమ్‌ అరోరా సహ నిర్మాతలు. నవంబర్‌ 7న హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -