Tuesday, March 24, 2026
E-PAPER
Homeవరంగల్ఎలాంటి షరతులు లేకుండా వెంటనే డబ్బులు అందించాలి

ఎలాంటి షరతులు లేకుండా వెంటనే డబ్బులు అందించాలి

- Advertisement -
  • సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్
    నవతెలంగాణ-రాజన్నసిరిసిల్ల:
    సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన వారందరికీ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా డబ్బులు అందించాలని సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో సహారా బాధితులతో కలిసి సిరిసిల్ల ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో అవసరాలకు ఉపయోగపడతాయని, అధిక వడ్డీ వస్తుందని కోట్లాదిమంది ప్రజలు డబ్బులు వివిధ పద్ధతులలో పొదుపు చేసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధితులు డిపాజిట్ చేసిన డబ్బులు ఇవ్వకుండా అనేక నిబంధనలు , షరతులు పెడుతూ 2023 మార్చి నెలలోపు పూర్తయిన అదే విధంగా 10 వేల నుండి 50 వేల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు చెల్లిస్తూ మిగతా వారందరికీ అన్యాయం చేస్తుందని డబ్బులు డిపాజిట్ చేసిన వారందరూ సహారా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారి పోయారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా డబ్బులు డిపాజిట్ చేసిన వారందరికీ వెంటనే అందించాలని లేకుంటే రాబోయే రోజుల్లో సహారా బాధితులందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జవ్వాజి విమల, కోడం రమణ సిపిఐ(ఎం) నాయకులు ఆడెపు రజిత, సందుపట్ల పోచమల్లు, గోవర్ధన్ సహారా బాధితులు బొడ్డు వీరేశం, నందం, లక్ష్మీపతి, నరేష్, సదానందం, కవిత, సుజాత, లక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -