మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై సీపీఐ(ఎం) ఖండన
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో 27మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. మరణించిన వారిలో మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు. చర్చలు జరపాలంటూ మావోయిస్టులు పదే పదే విజ్ఞప్తులు చేసినా వాటిని పట్టించుకోకుండా, కేంద్ర ప్రభుత్వం, అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం రెండూ చర్చల ద్వారా పరిష్కారాన్ని ఎంచుకోకూడదని నిర్ణయించుకున్నాయని పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. అందుకు బదులుగా హత్యలు, వినాశనం అనే అత్యంత అమానవీయమైన విధానాన్ని ఆ ప్రభుత్వాలు ఎంచుకున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. గడువును పునరుద్ఘాటిస్తూ కేంద్ర హోం మంత్రి, చర్చలు జరపాల్సిన అవసరం లేదంటూ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు చూస్తుంటే, మనుష్యుల ప్రాణాలను తీయడాన్ని కూడా ఒక విజయంగా చూసే ఫాసిస్ట్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమని సీపీఐ(ఎం) స్పష్టం చేసింది. చర్చల కోసం మావోయిస్టులు చేస్తున్న అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా పలు రాజకీయ పార్టీలు, సంబంధిత పౌరులు ప్రభుత్వాని కి విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల రాజకీయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నప్పటికీ, చర్చల కోసం వారు చేసిన విజ్ఞప్తులను వెంటనే ఆమోదించి, అన్ని పారా మిలటరీ కార్యకలాపాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరుతోందని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది.
అత్యంత అమానుషం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES