మలక్‌పేట్ యశోద ఆస్పత్రిలో ఆపరేషన్ విజయవంతం
కోమాలోంచి కోలుకున్న బాలుడు
తలకు తగిలే గాయాల పట్ల నిర్లక్ష్యం చేయొద్దు
మలక్‌పేట్ యశోద ఆస్పత్రి డాక్టర్ శ్రీనివాస్ బోట్ల
నవతెలంగాణ-శంషాబాద్
జారిపడి లేదా మరే కారణాలతో తలకు తగిలే గాయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలక్‌పేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ బోట్ల తెలిపారు. మలక్‌పేట్ యశోద ఆస్పత్రి బృందం శంషాబాద్ జోన్ కేంద్రంలోని ఎలైట్ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 12 ఏండ్ల బాలునికి జరిగిన అరుదైన బ్రెయిన్ సర్జరీ వివరాలను వెల్లడిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తలకు తగిలే గాయాల వల్ల మెదడుకు సంబంధించిన గాయా ల లక్షణాలు గమనించాలని అన్నారు. శంషాబాద్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ విద్యార్థి నగరంలో చదువుతున్న తన స్కూల్లో మెట్లు దిగుతూ జారి కింద పడిపోయి తలకు గాయాలు అయ్యాయని తెలిపారు. వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తే మెదడుకు సంబంధించిన గాయాలు కావొచ్చని అనుమానం కలిగితే వెంటనే మలక్‌పేటలోని ఆస్పత్రికి తీసుకువచ్చారని తెలిపారు. బాలుడికి అన్నీ పరీక్షలు చేస్తే మెదడుకు లోపల గాయాలైనట్టు గుర్తించామన్నారు. ఆ బాలుడు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీకి గురయ్యాడని, వెంటనే న్యూరో సర్జికల్ ఆపరేషన్, ఆధునిక న్యూరో క్రిటికల్ కేర్ సర్జరీలు చేశామన్నారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడని, ఏపీ డ్యూరల్ హిమారేజ్ ఉన్న ట్రో మాటిక్ బ్రెయిన్ గాయం పెద్ద తల ఎముక ఇరుగుడు కారణంగా కొన్ని సందర్భాల్లో మెదడు నలిగిపోవడంతో ఈ స్థితికి దారి తీసే అవకాశాలు ఉంటాయని వివరించారు. ఇలాంటి పరిస్థితులు నివారించేందుకు న్యూరో క్రిటికల్ కేర్ అవసరమవుతుందని చెప్పారు. వైద్యులు చేసిన సమగ్ర పరీక్షలో టెంపర్ పరీక్ష ద్వారా పెద్ద ఏపీ డ్యూరల్ హేమరేజ్ మెదడు మధ్య రేఖ తారుమారైనట్టు వైద్యులు గుర్తించినట్టు చెప్పారు. పరిస్థితి ప్రాణాపాయానికి దారి తీసే అవకాశం ఉండటంతో న్యూరో సర్జరీ బృందం క్రానియోటమీ చేసి రక్తం గడ్డను విజయవంతంగా తొలగించి బాలుడి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని చెప్పారు. బాలుడు దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. పరీక్షల్లో ఎడమ వారియేటల్ ప్రాంతంలో వాపు కనిపించడంతో ఆర్బిటల్ హిమటోమ ఉన్నట్టు గుర్తించామన్నారు. ఏది ఏమైనా ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు ఇతర ముఖ్య ప్రాంతాల్లో గాయాలైతే వెంటనే సమీప ప్రాంతంలోని ఆస్పత్రులకు తరలించాలని, వైద్యం చేయించకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందన్నారు. కోమా లోంచి బాలుడు కోలుకున్నట్టు తెలిపారు. ప్రజలు అవగాహన చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బాలుడికి అత్యంత క్లిష్టమైన ట్రామాటిక్ బ్రెయిన్ సర్జరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



