Thursday, November 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅత్యంత నీతివంతమైన కమ్యూనిస్టు సామినేని

అత్యంత నీతివంతమైన కమ్యూనిస్టు సామినేని

- Advertisement -

పోలీసులు విచారణ పేరుతో దొంగాట ఆడుతున్నారు : సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పెనుమల్లి మధు
రామారావు కుటుంబానికి పరామర్శ


నవతెలంగాణ-చింతకాని
అత్యంత నీతివంతమైన కమ్యూనిస్టు సామినేని రామారావు అని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. ఇటీవల హత్యకు గురైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు కుటుంబాన్ని బుధవారం మధు పరామర్శించారు. రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామారావు భార్య స్వరాజ్యం, కుమారుడు విజయ కుమార్‌తో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అనంతరం మధు మాట్లాడుతూ.. సామినేని రామారావుని రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోలేక మాటువేసి దొంగ చాటుగా హత్య చేశారన్నారు.

హంతకులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసులు కేసు విచారణ పేరుతో దొంగాట ఆడుతున్నారని ఆరోపించారు. పోలీసులు తలుచుకుంటే రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయొచ్చని, కానీ కావాలనే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా విచారణ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మృతి పాతర్లపాడు గ్రామస్తులకు తీరని లోటన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామారావు ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన వెంట పార్టీ మధిర డివిజన్‌ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కార్యదర్శి రాచబంటి రాము, సీనియర్‌ నాయకులు వత్సవాయి జానకి రాములు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -