Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకొడుకు నామినేషన్‌ వేసేవేళ తల్లి మృతి

కొడుకు నామినేషన్‌ వేసేవేళ తల్లి మృతి

- Advertisement -

చివరి రోజు కావడంతో నామినేషన్‌ వేశాక అంత్యక్రియలు

నవతెలంగాణ- కాగజ్‌నగర్‌
కుమురం భీం – ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మున్సిపాలటీలో 25వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుడుక శ్రీనివాస్‌ నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకోగా.. ఇంతలో ఆయన తల్లి తారాబాయి(70) అనారోగ్యంతో గురువారం రాత్రి మృతిచెందింది. అయితే, నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో బాధను దిగమింగుకుని ముందుగా మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ వేసి వచ్చాడు. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -