Tuesday, March 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅందరూ మాట్లాడుకునే సినిమా

అందరూ మాట్లాడుకునే సినిమా

- Advertisement -

శివకుమార్‌ రామచంద్రవరపు, డిబోరా డోరిస్‌ ఫెల్‌, రాజశేఖర్‌ అనింగి, విక్రమాదిత్య డాంబర్‌ ప్రధాన పాత్ర దారులుగా ప్రశాంత్‌ నామిని రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సువర్ణ టెక్స్టైల్స్‌’. యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ.వై.వి.ప్రొడక్షన్స్‌, సనాతన క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మాత అనిల్‌ ఈరుగుదిండ్ల నిర్మిస్తున్నారు. ప్రసాద్‌ ల్యాబ్‌లో దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో శివకుమార్‌ మాట్లాడుతూ,’ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్‌’లో చేస్తున్నా. హైటెక్‌ సిటీ వీధుల్లో నైటీ వేసుకుని ఈ సినిమాలో నన్ను దర్శకుడు పరిగెత్తించాడు. మంచి జీల్‌ ఉన్న దర్శకుడు ప్రశాంత్‌ నామిని. ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశాడు. యూత్‌కు బాగా నచ్చుతుంది’ అని అన్నారు.

‘టీజర్‌ చాలా బాగుంది. టీజర్‌ ఎలా ఉందో సినిమా కూడా అలానే తీస్తే మాత్రం అందరూ మాట్లాడుకునే సినిమా అవుతుంది. ఈ సినిమాతో ప్రశాంత్‌ నామిని ఓ మంచి దర్శకుడు అవుతాడు’ అని దర్శకుడు వేణు ఉడుగుల చెప్పారు. దర్శకుడు ప్రశాంత్‌ నామిని మాట్లాడుతూ,’ఇదొక కొత్త జోనర్‌. కొంత అడల్ట్‌ కంటెంట్‌ ఉన్నా ఫ్యామిలీస్‌తో కలిసి చూడదగ్గ సినిమా ఇది’ అని చెప్పారు. హీరో సోహైల్‌ మాట్లాడుతూ,’ప్రశాంత్‌ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఫస్ట్‌ ఈ కథని నాకే చెప్పాడు. అయితే నాకే ఈ జోనర్‌ చేయాలంటే ధైర్యం చాలలేదు. ఈ టీజర్‌ చూస్తుంటే యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -