Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం

ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం

- Advertisement -

మత్స్య అవతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

నవతెలంగాణ-భద్రాచలం
ఆధ్యాత్మిక వైభవంతో భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభమ య్యాయి. దశావతారాలలో భాగంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి మత్స్య అవతారంలో దర్శనమిచ్చారు. వేకువజామునే మేలుకొలుపు సేవానంతరం పంచామృతాలతో మూలమూర్తులను అభిషేకించిన అర్చకులు.. పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్య ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తిని మత్స్యవతారంలో అలంకరింపజేసి దర్శనార్థం ఉంచారు. ముక్కోటి అధ్యయనోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి రామయ్య దర్శనానికి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తున్నారు.

వారికి ఎటువంటి ఆటంకాలూ కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు స్వామివారు మత్స్యవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజైన ఆదివారం సీతారామచంద్ర స్వామి కుర్మావతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆలయ అధికారులు శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని తన క్యాంపు కార్యాలయంలో కలిసి అధ్యయనోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. ఈనెల 29వ తేదీన జరిగే స్వామి వారి తెప్పోత్సవం కార్యక్రమానికి, 30వ తేదీన వైకుంఠ ఉత్తర ద్వారదర్శన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -