– డబ్బుకోసమే వృద్ధుని హత్య..!
– కత్తితో వృద్ధుడి గొంతు కోసి హత్య చేసిన నిందితుడు…
– నిందితుడిని అరెస్ట్ చేసి,రిమాండ్ కి తరలిస్తున్న పోలీసులు…
– ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ అవినాష్ కుమార్..
నవతెలంగాణ – భైంసా
కుభీర్ మండలంలోని చాత గ్రామంలో జూలై 17 అర్ధరాత్రి బలరాం గౌడ్ అనే వృద్ధుడు రక్తపు మరకలతో హత్యగావించబడగా…బుధవారం ఈ మర్డర్ కి సంబంధించిన పలు విషయాలు ఏఎస్పీ అవినాష్ కుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వృద్ధుని కుటుంబీకులు, బంధువుల శుభకార్యం నిమిత్తం వేములవాడకి వెళ్లగా.. వృద్ధుడు బలరాం గౌడ్ బట్టి వ్యాపారాన్ని చూసుకుంటూ ఇంటివద్దే ఉండిపోయాడు. చాత గ్రామంలో కూలీగా పనిచేసుకుంటున్న సిల్మల సంతోష్ (45) డబ్బుల కోసం జూలై 17 అర్ధరాత్రి కత్తితో వృద్ధున్నీ దారుణంగా గొంతు కోసి హత్య గావించి, రూ.1 లక్ష యాభై వేలు తీసుకుని పరారయ్యాడు.
జిల్లా ఎస్.పి జానకి షర్మిల ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి రూరల్ సీఐ నైలు, రూరల్ ఎస్.ఎచ్.ఓ శంకర్, భైంసా సి.ఐ గోపీనాథ్, కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి, దిలావర్ పూర్ ఎస్. ఐ రవీందర్ తదితర పోలీస్ సిబ్బంది క్లూ టీమ్స్, సెల్ సిగ్నల్, సి.సి.ఎస్ టీమ్, ఫింగర్ ప్రింట్ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుని అదుపులోకి తీసుకున్నారనీ పేర్కొన్నారు. ప్రస్తుతo నిందితుని వద్ద రూ.1 లక్ష యాభై వేలను రికవరీ చేశామన్నారు. అలాగే నిందితుని వద్ద ఒక చిన్న కత్తి, పెద్ద కత్తి, గొడ్డలి, మొబైల్ ఫోన్ లభ్యం అయ్యాయని తెలిపారు. నిందితునిపై గతంలో 2008 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ స్టేషన్ పరిధిలో సైతం కేసు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
వీడిన మర్డర్ మిస్టరీ..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES