- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన ముదిరాజ్ సంక్షేమ సమితి అధ్యక్షుడు, ధర్పల్లి మండల మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపిని హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని ముదిరాజ్ సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఇమ్మడి గోపి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇమ్మడి గోపి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఇమ్మడి గోపిని హత్య చేసిన హంతకులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వేల్పూర్ ముదిరాజ్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



