Wednesday, October 15, 2025
E-PAPER
Homeసినిమా'మీసాల పిల్ల..' సందడి షురూ

‘మీసాల పిల్ల..’ సందడి షురూ

- Advertisement -

చిరంజీవి, నయనతార జంటగా నటించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అర్చన సమర్పిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘మీసాల పిల్ల’ పూర్తి లిరికల్‌ వీడియో విడుదలైంది. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్‌ పవర్‌ఫుల్‌ ఎలక్ట్రానిక్‌ బీట్స్‌, పంచ్‌ బాస్‌ లైన్స్‌, మెలోడీలతో అదిరిపోయింది. భాస్కరభట్ల సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదిత్‌ నారాయణ్‌ చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ సినిమా కోసం పాడటం విశేషం. శ్వేతా మోహన్‌ వోకల్స్‌ మరింత బ్యూటీని యాడ్‌ చేసింది చిరంజీవి చార్మింగ్‌, స్టైలిష్‌ సూట్‌లో కనిపిస్తూ తన ట్రేడ్‌మార్క్‌ మెగా గ్రేస్‌ను స్టైలిష్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో అదరగొట్టారు. విజయ్ పొలాకి అందించిన కొరియోగ్రఫీ ఫ్యాన్స్‌కు విజువల్‌ ట్రీట్‌లా మారింది. చిరు, నయనతార కెమిస్ట్రీ మ్యాజికల్‌గా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -