సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు టీ ఉప్పలయ్య బొట్లచక్రపాణి
నవతెలంగాణ – పరకాల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 9 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు టీ ఉప్పలయ్య బొట్లచక్రపాణిలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని వీటిని రద్దు కోసం జరిగే దేశవ్యాప్త సమ్మెలో పరకాల ప్రాంతంలోని కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సిఐటియు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం పోతిరెడ్డి సమ్మక్క అధ్యక్షతన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో జరిగింది.ఈ సమావేశం లో పాల్గొన్న చక్రపాణి, ఉప్పలయ్య మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కరానికి,కార్మిక భద్రథ కి,సంక్షేమానికి అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్నారన్నారు.
కార్మిక చట్టాలని కరోనా కాలంలో మోడీ ప్రభుత్వం ముజువాణి ఓటుతో పార్లమెంట్ లో మార్పులు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందన్నారు.కార్పొరేట్ యాజమాన్యాలను సంతృప్తి పరచడానికి,వారి ఆదాయాలను మరింత రెట్టింపు ఛేయడానికి,కార్మిక వర్గం ముల్గులు పీల్చి పిప్పి చేయడానికి నాలుగు లేబర్ కోడ్ లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఇప్పటీకే దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాలలో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తున్నారని,బిజెపి మిత్రుడుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పాలను పూర్తైనా సందర్భం లో కార్మికులకు ఎనిమిది గంటల పని స్థానంలో పది గంటల పని దినాన్ని అమలు చేస్తున్నారన్నారు.
కాంగ్రెసు పాలిత కర్ణాటక,రాజస్థాన్ లలో నాలుగు లేబర్ కోడ్ ల అమలుకు రంగం సిద్ధం చేశారన్నారు.ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా,కార్మిక వర్గాన్ని తీవ్ర ఇబ్బంది గురి చేయడం తప్ప మరొకటి లేదన్నారు.కార్మిక చట్టాల పరిరక్షణ కొరకు జులై 9 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెని జిల్లా అన్ని రంగాల్లో అత్యంత జయప్రదంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంఈఓకి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సమ్మె నోటీస్ అందించడం జరిగింది.ఈ సమావేశంలో సిఐటియు నాయకులు భయ్యా కృష్ణరాజు, నిర్మల ,యాదమ్మ, కళ, సమ్మయ్య, కరుణ, సంధ్య, తారాబాయి ,నాగరాణి తదితరులు పాల్గొన్నారు. నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని వీటిని రద్దు కోసం జరిగే దేశవ్యాప్త సమ్మెలో పరకాల ప్రాంతంలోని కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు టీ ఉప్పలయ్య బొట్లచక్రపాణిలు పిలుపునిచ్చారు.
ఈరోజు సిఐటియు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం పోతిరెడ్డి సమ్మక్క అధ్యక్షతన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో జరిగింది.ఈ సమావేశం లో పాల్గొన్న వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కరానికి,కార్మిక భద్రథ కి,సంక్షేమానికి అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్నారని అన్నారు.కార్మిక చట్టాలని కరోనా కాలంలో మోడీ ప్రభుత్వం ముజువాణి ఓటుతో పార్లమెంట్ లో మార్పులు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని అన్నారు.కార్పొరేట్ యాజమాన్యాలను సంతృప్తి పరచడానికి,వారి ఆదాయాలను మరింత రెట్టింపు ఛేయడానికి,కార్మిక వర్గం ముల్గులు పీల్చి పిప్పి చేయడానికి నాలుగు లేబర్ కోడ్ లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
ఇప్పటీకే దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాలలో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తున్నారని,బిజెపి మిత్రుడుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పాలను పూర్తైనా సందర్భం లో కార్మికులకు ఎనిమిది గంటల పని స్థానంలో పది గంటల పని దినాన్ని అమలు చేస్తున్నారన్నారు.కాంగ్రెసు పాలిత కర్ణాటక,రాజస్థాన్ లలో నాలుగు లేబర్ కోడ్ ల అమలుకు రంగం సిద్ధం చేశారన్నారు.ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా,కార్మిక వర్గాన్ని తీవ్ర ఇబ్బంది గురి చేయడం తప్ప మరొకటి లేదన్నారు.కార్మిక చట్టాల పరిరక్షణ కొరకు జులై 9 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెని జిల్లా అన్ని రంగాల్లో అత్యంత జయప్రదంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎంఈఓ గారికి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సమ్మె నోటీస్ అందించడం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు భయ్యా కృష్ణరాజు నిర్మల యాదమ్మ కళ సమ్మయ్య కరుణ సంధ్య తారాబాయి నాగరాణి తదితరులు పాల్గొన్నారు.