Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్తంగా సర్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

దేశవ్యాప్తంగా సర్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
రాజోలి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వచ్చేనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నోటీసు రాజోలి ఎంపీడీవో గారు అబ్దుల్ సయ్యద్ ఖాన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది మరియు కెవిపిఎస్ నాయకులు మాట్లాడుతూ పంచాయితీ సిబ్బందికి బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికుల్లో ఒకరు చనిపోతే వారి కుటుంబ సభ్యులతో ఉద్యోగం ఇవ్వాలని. వీరు ఎవరైనా చనిపోతే దాన సంస్కారాలకు పదివేల నుంచి 20వేల రూపాయలు ఇవ్వాలని అలాగే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఇళ్ల స్థలం కూడా కేటాయించాలని  కార్మికులకు అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు వచ్చే నెల 12వ తేదీన పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు రమేష్ సార్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆరు విజయకుమార్ తెలంగాణ పంచాయతీ కార్మిక సంఘం కార్యదర్శి లక్ష్మన్న అధ్యక్షులు తిక్కన్న సహాయ కార్యదర్శి కృష్ణ సౌల్ రాజు మహేష్ నడిబన్న సభ్యులు దస్తగిరి నరసన్న మద్దిలేటి వరదల అశోక్ సుందరాజు రంగన్న పాల్గొన్నారు. అనంతరం సమ్మె నోటీసుని ఎంపీడీవో అబ్దుల్ సయ్యద్ ఖాన్గారికి ఇవ్వడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -