నవతెలంగాణ హైదరాబాద్:
సురవరం సుధాకర్ రెడ్డి చూస్తే ముందుగా ఒక్క సంపూర్ణ మానవుడు గుర్తుకు వస్తారు. కల్మషం లేని వ్యక్తి సురవరం. కమ్యూనిస్టుల ఐక్యత బలంగా కొరుకున్న నాయకుడు సురవరం అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సుధాకర్ రెడ్డితో నాకు కలిసి పని చేసిన అనుభవం ఉందని అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. మానవుని సమాజంలో అన్ని వర్గాలు సమానత్వంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ సురవరం లాగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
కమ్యూనిస్టుల అవసరం గతం కంటే నేడు ఎక్కువ ఉంది. కానీ, ఈ సమయంలోనే కమ్యూనిష్టు ఉద్యమం బలహీన పడింది. దీని అంగీకరించాల్సిందే. అంటే మనం నిరాశ చెందడంకాదు, అమర వీరలా స్ఫూర్తితో ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచించాలి. ‘ఇలాంటి సమయంలోనే కమ్యూనిష్టులకు భవిష్యత్ ఉందా?` అనే ప్రశ్నలు వస్తున్నాయి. కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్ ఉందా అని తిప్పి ఆలోచించాల్సిన సందర్భం ఇదని అన్నారు.