విస్తరించిన జీహెచ్‌ఎంసీ
వాటర్‌బోర్డుకు బడ్జెట్ కేటాయింపుల్లో నిరాశే
నవతెలంగాణ-సిటీబ్యూరో
శాసనసభలో శుక్రవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డుతోపాటు హైడ్రాకు నిరాశ మిగిలింది. జీహెచ్‌ఎంసీిని విభజిస్తూ మూడు కార్పొరేషన్‌ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా పేరు మార్చినా, ఆ మేరకు నిధుల పెంపు కనిపించలేదు. జీహెచ్‌ఎంసీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీలోకి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తూ మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. 2 వేల 53 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణీంలో 30 సర్కిళ్ల నుంచి 60కి, ఆరు జోన్ల నుంచి పన్నెండు జోన్లకు, అలాగే 150 మున్సిపల్ వార్డులను 300 వార్డులుగా పునర్విభజించారు.
జీహెచ్‌ఎంసీ తరహాలోనే వాటర్‌బోర్డును, హైడ్రాను విస్తరించారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణ అవసరాలతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు భారీగా నిధులు అవసర మున్నారు. ట్రై కార్పొరేషన్లలో కార్పొరేషన్ల అమలు, రవాణా వ్యవస్థను మెరుగు పరిచడం, ఫ్లైఓవర్లు, ఆర్.ఓ.బిలు, రోడ్ల విస్తరణ పనులతోపాటు ప్రధాన ప్రాజెక్ట్ లు పూర్తి చేసేందుకు భారీ బడ్జెట్ అవసరముంది. మూడు కార్పొరేషన్లకు ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)కు సంబంధించి సర్కారు దాదాపు రూ.10వేల కోట్ల కేటా యిస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే గతేడాదితో పోల్చితే పెద్దగా నిధుల పెంపు కనిపించలేదు.
కోర్ అర్బన్ రీజియన్‌గా పేరు మార్చినా..
హైదరాబాద్ నగర విస్తరణ జరిగినప్పటికీ, 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా కొనసాగడం గమనార్హం. ప్రభుత్వం నగర పరిమితులను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి, కోర్ అర్బన్ రీజి యన్‌గా పేరు మార్చినా, ఆ మేరకు నిధు ల పెంపు కనిపించలేదు. మొత్తం క్యూర్ ప్రాంతానికి సుమారు రూ.9,740 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇందులో ప్రధానం గా కొన్ని పెద్ద ప్రాజెక్టులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్ట్‌కు రూ.2,654 కోట్లు కేటాయింపు లు జరిపింది. రహదారుల విస్తరణ, పై వంతెనలు, అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జీలు, వరద నాలాల అభివృద్ధి వంటి పనులకు ఈ నిధులు వినియోగించ నున్నారు.
హైడ్రాకు తగ్గిన కేటాయింపులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కి సైతం నిధుల కేటాయింపులు తగ్గించారు. హైడ్రాకు దాదాపు రూ.200కోట్లు అవసర మని అధికారులు అంచనా వేశారు. అయితే బడ్జెట్‌లో రూ.120 కోట్ల నుంచి రూ. 101.49 కోట్లకు తగ్గించడం గమనార్హం. ముఖ్యంగా పథకాల అమలు కోసం ఇచ్చే నిధులను రూ.100 కోట్ల నుంచి రూ.50 కోట్లకు సగానికి తగ్గించారు.
జలమండలికి రూ.3,005 కోట్ల రుణాలు
నీటి సరఫరా రంగంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరే జ్ బోర్డు(హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి) కోసం రూ.3,005 కోట్ల రుణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతోపాటే 20 లీటర్ల ఉచిత నీటి పథకానికి రూ.300 కోట్లు యథాతథంగా కేటాయించారు. నగర విస్తీర్ణం పెరిగినా, బడ్జెట్ కేటాయింపులు మాత్రం పాత జీహెచ్‌ఎంసీ స్థాయిల్లోనే కొనసాగినట్టు కనిపిస్తోంది.
అవసరం బారెడు.. కేటాయింపులు మూరేడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



