Saturday, February 21, 2026
E-PAPER
Homeబీజినెస్ముగియని 'జీ' కష్టాలు

ముగియని ‘జీ’ కష్టాలు

- Advertisement -

– నిధుల మళ్లింపునపై సెబీ నోటీసులు
ముంబయి :
మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కష్టాలు ముదురుతున్నాయి. నిధుల మళ్లింపు ఆరోపణలు, పాలనాపరమైన లోపాలు, విఫలమైన విలీనాలతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మార్కెట్‌ రెగ్యూలేటర్‌ సెబీ తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. గతంలో సోనీతో జరగాల్సిన కీలక ఒప్పందం కుప్పకూలడానికి ప్రధాన కారణమైన ఈ ఆర్థిక అవకతవకల అంశాన్ని సెబీ మళ్ళీ తవ్వి తీయడం సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. కేవలం సంస్థకే కాకుండా.. కీలక బాధ్యతల్లో ఉన్న ఛైర్మన్‌, సిఇఒలకు సైతం సెబీ నోటీసులు జారీ చేసింది.
అంతర్గత ఆర్థిక లావాదేవీలపై సెబీ గత కొన్నేళ్లుగా సాగిస్తున్న సుదీర్ఘ విచారణలో భాగంగా ఈ నోటీసులను అందుకున్నట్లు జీ ధృవీ కరించింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ మీడియా దిగ్గజం అత్యున్నత ప్రమాణా లు పాటిస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఏండ్ల తరబడి సాగుతున్న ఈ విచారణ లు..చట్టపరమైన చిక్కులు సంస్థ ఉనికి నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మరోవైపు రిలయన్స్‌ వయాకామ్‌ 18, డిస్నీల విలీనం తర్వాత మీడియా రంగంలో ఏర్పడిన భారీ పోటీని ఎదుర్కోవడానికి సిద్ధమవు తున్న తరుణంలో తాజా నియంత్రణ చర్యలు సంస్థ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -