Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి

నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి

- Advertisement -

చేగువేరా స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నిజామాబాద్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ-నిజామాబాద్‌ సిటీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు చేయాలని, ప్రభుత్వాలు కార్పొరేట్‌ యాజమాన్యానికి వత్తాసు పలకకుండా అందరికీ ఒకే ఉచిత విద్యా విధానాన్ని రూపొందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భగత్‌సింగ్‌, చేగువేరా స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర 4వ మహాసభలు బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న మహాసభల సందర్భంగా ముందుగా మొదటిరోజు ప్రెస్‌క్లబ్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్‌ శివలింగ రాజన్‌ జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ తాహేర్‌బిన్‌ హందాన్‌, మాజీ జాతీయ అద్యక్షులు తక్కెలపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి బనోతు రఘురాం, ఏఐకేఎస్‌ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలకై ఏఐఎస్‌ఎఫ్‌ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. ఎందరో నాయకులు ఈ విద్యార్థి సంఘం ద్వారా ఎదిగారని, తాను కూడా ఈ సంఘం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నానని తెలిపారు. దేశ భవిష్యత్తు విద్యార్థులపై ఉందని, చెడు సహవాసాలు విడిచిపెట్టి, మంచి మార్గం వైపు అడుగులు వేయాలన్నారు.

రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్యం కోసం పని చేయాలన్నారు. ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకు రావాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాభివృద్ధికి, విద్యార్థుల కోసం నిధులు కేటాయిస్తున్నారన్నారు. జిల్లాలో ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆఫీస్‌ బేరర్స్‌ ఇటికెల రామకృష్ణ, గ్యార నరేష్‌, రెహమాన్‌, కాసోజు నాగజ్యోతి, బరిగేలా వెంకటేష్‌ , ఏఐకేఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజారెడ్డి, రాజేశ్వర్‌, రాజన్న, స్వరూపరాణి, విట్టల్‌ గౌడ్‌, దశరథ్‌, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -