శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మేకర్స్ టీజర్‌ని లాంచ్ చేశారు. ఈ వేడుకకు హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ,’ఈ సినిమాకి టాప్ హీరో మా డైరెక్టర్. ఆయన చాలా బలంగా నన్ను ముందుకు తీసుకొచ్చారు. మా డిఓపి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి సూపర్ స్టార్ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రాజేష్ ఈ సినిమా కోసం ఒక పోరాటమే చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.
గాయత్రీ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. మైత్రి వారు ఈ సినిమాని నైజంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ధీరజ్ ఆంధ్రలో రిలీజ్ చేస్తున్నారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో నాకు ఒక బ్యూటీఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు’ అని హీరోయిన్ గాయత్రి రమణ చెప్పారు. డైరెక్టర్ బాల సతీష్ మాట్లాడుతూ,’ధీరజ్ ఈ సినిమాని రెండుసార్లు చూశారు. ఆయన రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చినప్పుడు మాకు ఎంతో నమ్మకం కలిగింది’ అని అన్నారు. ‘ఒక మంచి జెన్యూన్ కంటెంట్‌తో ఈ సినిమా చేశాం. అందరూ ఈ సినిమాని బ్లెస్ చేస్తారని, ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను’ అని ప్రొడ్యూసర్ రాజేష్ చెప్పారు.
సరికొత్తగా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



