నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని 30 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామాలలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగను రైతన్నలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలోని రైతులు బసవన్నను ఉదయం స్నానాలు చేయించి, రంగురంగుల బట్టలతో తయారుచేసిన జూలు, తాయెత్తులు బాషింగలు , గొండలు , పెయింట్ తో కొమ్ములకు రంగులు అద్ది అలంకరణ చేస్తారు. సాయంత్రం పూట గ్రామస్తులు అందరూ కలిసి భాజా భజంత్రీలతో అలంకరణ చేసిన కాడేడ్లకు , ఆవులకు, దూడలకు హనుమాన్ మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేయించి ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటకాలతో నైవేద్యం అందించి కాడేడ్లకు మరియు ఆవుకు వివాహ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం బంధుమిత్రులను ఆహ్వానించి ప్రాపంచి భోజనాలు విందు అరగిస్తారు.
గ్రామాల్లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య పండుగ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES