నవతెలంగాణ- మద్నూర్
మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకర్గానికి అంగన్వాడీల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మద్నూర్ మండల కేంద్రంలో 9 అంగన్వాడి సెంటర్ల టీచర్లు ఈ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ కళావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సాందర్బంగా కళావతి మాట్లాడుతూ.. నూతన పంచాయితీ పాలకవర్గం అంగన్వాడీల ప్రగతికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం నిధులు వచ్చాయని, కొన్ని సెంటర్లకు మరుగుదొడ్లు, ముత్రశాల నిర్మాణంకు నిధులు మంజూరైనట్లు ఆమె తెలిపారు.
వీటి నిర్మాణాల కోసం సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. అనంతరం అంగన్వాడి టీచర్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు, గర్భవతులకు పౌష్టికాహరం అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారి పిల్లల సంఖ్య పెరగడానికి నూతన పాలకవర్గం సభ్యులు చోరవ చూపాలని కోరారు. ఈ క్రమంలో సీడీపీఓ కళావతి సర్పంచ్ దంతపులు ఉషా సంతోష్ మేస్త్రీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు కళావతి, చంపాబాయి, మిగతా మొత్తం తొమ్మిది సెంటర్ల అంగన్వాడి టీచర్లు మహిళలు చిన్నారి పిల్లలు పాల్గొన్నారు.



