నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో ఆదివారం స్పందన పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ కంతి మధు,ఉప సర్పంచ్ దూడల శ్రీధర్,పంచాయతీ కార్యదర్శి స్వప్నలకు అభినందనలు తెలుపుతూ పూలమాలలతో శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఖుర్షిద్ పాషా మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన పదవి గ్రామ అభివృద్ధి తో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కోరారు. గ్రామానికి సేవ చేసే అదృష్టం సర్పంచ్ పదవి అందరికీ లభించదని వచ్చిన పదవి ద్వారా సేవ చేసి పేరు గడించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు పంతుల శ్రీనివాస్,మంత్రి దేవేందర్,దయ్యాల తులసి దాస్,డాక్టర్ లక్ష్మయ్య,పెండ్యాల వెంకటేష్,కూరాకుల రాములు, చింతల రామకృష్ణ,భద్రయ్య బచ్చ మల్లయ్య పాల్గొన్నారు.
స్పందన సొసైటీ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గానికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



