ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ‘స:కుటుంబానాం’ సినిమా కూడా అలాంటి కోవలోకే ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న హీరో ఫ్యామిలీనీ హేట్ చేస్తూ కనిపించిన ఈ చిత్ర టీజర్‌తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక, రచయిత ఉదరు శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా ప్రేక్షకులను అలరించబోతున్నారు.
‘ఓ పక్క నుండి ‘అర్జున్ రెడ్డి’ లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని టీజర్ చెప్పకనే చెప్పింది. ఇందులో ప్రతి డైలాగ్, విజువల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం హాస్యం బాగా పండుతుందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్ మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. రామ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా ఇండిస్టీలో ఒక మార్క్ సష్టిస్తారనిపించేలా తన ప్రెసెన్స్, పర్ఫార్మెన్స్ కనిపించింది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని ఈ చిత్ర టీజర్ అనిపిస్తుంది. టీజర్‌లోని సంగీతం చాలా బాగుంది. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి తెలుగింటి భోజనం అందించనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
సరికొత్తగా ‘స:కుటుంబానాం’
- Advertisement -
- Advertisement -