Wednesday, February 18, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్త 'క్రేజీ కల్యాణం'

సరికొత్త ‘క్రేజీ కల్యాణం’

- Advertisement -

నరేష్‌ వీకే, అనుపమ పరమేశ్వరన్‌, తరుణ్‌ భాస్కర్‌, ‘రాజ్‌ వెడ్స్‌ రాంబాయి’ ఫేమ్‌ అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్‌ బ్యానర్‌ పై ప్రొడక్షన్‌ నెం.2గా బూసమ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బుధవారం హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ బర్త్‌ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, మేకర్స్‌ ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో పెళ్లి కూతురిగా సంతోషంగా డ్యాన్స్‌ చేస్తున్న అనుపమ స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ఆమె ఈ చిత్రంలో కీర్తి అనే క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించనుంది.

పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్‌ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌ – సాయి కదిర, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – శ్రీపాల్‌ మాచర్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – అఖిల్‌ సాయి శ్రీమూర్తి, కొరియోగ్రాఫర్‌ – ఈశ్వర్‌ పెంటి, యాక్షన్‌ – డ్రాగన్‌ ప్రకాష్‌, లిరిక్స్‌ – గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్‌, కాసర్ల శ్యామ్‌, ఎడిటర్‌ – శ్రావణ్‌ కటికనేని, డీవోపీ – శ్యామ్‌ దూపాటి, మ్యూజిక్‌ – సురేష్‌ బొబ్బిలి, స్క్రీన్‌ ప్లే – శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్‌ఆర్‌), ప్రొడ్యూసర్‌ – బూసం జగన్‌ మెహన్‌ రెడ్డి, స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్షన్‌ – బద్రప్ప గాజుల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -