Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంతదుపరి సీజేఐగాజస్టిస్‌ బీఆర్‌ గవాయ్

తదుపరి సీజేఐగాజస్టిస్‌ బీఆర్‌ గవాయ్

- Advertisement -

– మే 14న సీజేఐగా బాధ్యతల స్వీకరణ
– కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియామకమయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో బీఆర్‌ గవాయ్ ని కొలిజీయం ఇటీవల తర్వాతి సీజేఐగా జస్టిస్‌ గవారు పేరును ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొలీజియం సిఫారసులకు ఆమోదముద్ర వేశారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ ఆరు నెలల పాటు సీజేఐగా పని చేయనున్నారు. షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన దేశంలోని రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఘనత సాధించనున్నారు. ఇంతకు ముందు ఇదే దళిత సామాజిక వర్గానికి చెందిన జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ 2007 నుంచి 2010 వరకు సీజేఐగా సేవలందించారు.
జస్టిస్‌ గవాయ్ 1960 నవంబర్‌ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. జస్టిస్‌ గవాయ్ తండ్రి దివంగత ఆర్‌ఎస్‌ గవాయ్ సైతం ప్రముఖ సామాజిక కార్యకర్త. బీహార్‌-కేరళ మాజీ గవర్నర్‌గా పని చేశారు. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్‌ గవాయ్ 1985 న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ బారిస్టర్‌ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ బాంబే హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్‌ చేశారు. 1992లో నాగపూర్‌ బెంచ్‌ అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ లాయర్‌గా, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియామకమయ్యారు. జస్టిస్‌ గవాయ్ 2003లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ గవారు ముంబయి, నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌, పనాజీ బెంచ్‌లలో 15 సంవత్సరాలు పనిచేశారు. 2016లో నోట్ల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన బెంచ్‌లోనూ జస్టిస్‌ బీఆర్‌ గవారు సైతం ఉన్నారు. అలాగే, బుల్డోజర్‌ చర్యకు వ్యతిరేకంగా ఇచ్చిన ఉత్తర్వులో జస్టిస్‌ గవాయ్ ఒకరు. ఎలక్ట్రోరల్‌ బాండ్లకు సంబంధించి తీర్పు వెలువరించిన ధర్మాసనంలోనూ ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad