Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో సలి బోనాల సందడి

మండలంలో సలి బోనాల సందడి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం సలి బోనాల సందడి నెలకొంది. ఉదయమే మహిళలు శనివారం రాత్రే వండి వాడ్చిన సలి బోనాలను నెత్తినెత్తుకొని గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్లి  నైవేద్యాలను సమర్పించారు. పిల్లా పాప మంచి ఉండాలని గ్రామ దేవతలను వేడుకుంటూ చిలకల గుర్రాలను ఎక్కించి, కల్లు శాఖలను పోశారు. ఈ సందర్భంగా పిల్లా పాపా, గోడ్డు గోదా చల్లంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నారు.సలి బోనాల నేపథ్యంలో గ్రామ దేవతల ఆలయాల వద్ద స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలు ఏర్పాటులను చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -