Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'సువ్వి సువ్వి..' సందడి షురూ

‘సువ్వి సువ్వి..’ సందడి షురూ

- Advertisement -

అగ్ర కథానాయకుడు పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఎస్‌.తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్‌’కి విశేష స్పందన లభించింది. సంగీత తుఫాను లాంటి ఈ పాట అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుద లైంది. ‘ఫైర్‌ స్టార్మ్‌’కి పూర్తి భిన్నంగా హదయాలను హత్తుకునేలా ఈ గీతం సాగింది. తమన్‌ అద్భుతమైన సంగీత ప్రయాణంలో గొప్ప పాటలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రేమ గీతాన్ని తమన్‌ ఎంత అందంగా స్వరపరిచారో.. గాయని శతి రంజని అంతే మధురంగా ఆలపించారు. కళ్యాణ్‌ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొని వచ్చింది. ప్రేమ పాటలను స్వరపరచడంలో దిట్టగా తమన్‌ ఎందుకు రాజ్యమేలుతున్నారో ఈ గీతం మరోసారి రుజువు చేసింది. ఈ పాటలో పవన్‌ కళ్యాణ్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంట చూడ ముచ్చటగా ఉంది. ఈ జోడీ తెరపై సరికొత్తగా కనిపిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ గంభీరాన్ని సమతుల్యం చేసేలా కన్మణిగా ప్రియాంక మోహన్‌ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ, ప్రకాష్‌ రాజ్‌, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad