- Advertisement -
– జెడ్పిసిఈవో గౌతమ్ రెడ్డి
నవతెలంగాణ-రాయికల్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జెడ్పిసిఈవో (ప్రత్యేక అధికారి) గౌతమ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, సిబ్బంది ఏర్పాట్లు,మౌలిక వసతులపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా,సజావుగా సాగాలని సూచించారు.ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, ఎంపీడీవో బింగి చిరంజీవి,మేనేజర్ వెంకటి పాల్గొన్నారు.
- Advertisement -



