Sunday, February 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు

కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు

- Advertisement -

కావాలనే వేధిస్తున్నారు..
ఫోన్‌ ట్యాపింగ్‌కు రాజకీయ నాయకులకు సంబంధం ఉండదు
సిద్దిపేటలోని అమరవీరుల స్థూపం వద్ద మీడియా సమావేశంలో.. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

నవతెలంగాణ-సిద్దిపేట
సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరిత ధోరణితోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. సిద్దిపేటలోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం దగ్గర శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో బీఆర్‌ఎస్‌పై వేధింపులను దారావాహిక సీరియల్‌ తరహాలో రెండేండ్ల నుంచి కొనసాగిస్తున్నారన్నారు. ట్యాపింగ్‌ విషయంలో రాజకీయ నాయకులకు సంబంధం ఉండదని, అధికారులు మాత్రమే చూసుకుంటారని తెలిపారు. రేవంత్‌రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించి ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు.

1885లోనే ట్యాపింగ్‌పై చట్టం వచ్చిందని.. టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారం పోలీసు శాఖ సమాచారం సేకరిస్తుందని తెలిపారు. ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్‌ చేయమని ఎవరికి చెప్పరనీ, అధికారులు దేశ భద్రత కోసం ఫోన్‌లు ట్యాపింగ్‌ చేస్తారన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్‌ వేశారనీ, విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను వేధించడం అప్రజాస్వామికమని, తెలంగాణ ప్రజల నుంచి ఆయనను వేరు చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌ తెలంగాణ తల్లి విగ్రహా విష్క రణకు, కొండా సురేఖ, సీతక్క.. సమ్మక్క సారలమ్మ జాతరకి రమ్మని ఎర్రవెల్లికి వెళ్ళి ఆహ్వానిస్తారు.. కానీ పోలీస్‌ అధికారులు నందినగర్‌ ఇంటికి వెళ్లి నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు.

ఎలక్షన్‌ ఆఫిడ విట్‌లో హరీశ్‌రావు ఇంటి అడ్రస్‌ సిద్దిపేట ఉంటే.. హైదరా బాద్‌ ఇంటి అడ్రస్‌కి నోటీస్‌ ఇచ్చారన్నారు. తాను అఫిడవిట్‌లో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ అడ్రస్‌ రాస్తే హైదరాబాద్‌లో నోటీసులు ఇచ్చారని, రేవంత్‌రెడ్డి ఇంటి అడ్రస్‌ కొడంగల్‌ అయితే గతంలో అధి కారులు హైదరాబాద్‌లో నోటీస్‌ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్‌కు మాత్రం అలా చేయక వివక్ష చూపుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయమన్నారు. ఈ కార్య క్రమంలో పట్టణ అధ్యక్షులు సంపత్‌ రెడ్డి, కనకరాజు, నాయకులు రెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, పొన్నమల్ల రాములు, రమేష్‌, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -