ప్రతీ శనివారం క్రీడలు నిర్వహించాలని..
ఇంటర్మీడియేట్ విద్యామండలి డిప్యూటీ సెక్రటరీ హేమ చందర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగేలా ప్రతి అధ్యాపకుడు కృషిచేయాలని ఇంటర్మీడియెట్ విద్యా మండలి డిప్యూటీ సెక్రటరీ సీ.హెచ్ హేమ చంద్ర కళాశాల సిబ్బందికి ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను, విద్యార్ధుల హాజరు నమోదు, కళాశాల పరిసరాలను ఆయన పరిశీలించారు.
అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించి కళాశాలలు అడ్మిషన్లు పెంచడంతో పాటు డ్రాపౌట్స్ లేకుండా కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి కళాశాలకు హాజరయ్యేలా అధ్యాపకులు రోజుప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ‘ఫిజిక్స్ వాలా’ ద్వారా ఆన్లైన్, నీట్( ఎన్ఈఈటి), జీ(జేఈఈ) మెయిన్స్, క్లాట్( సీఎల్ఏటి) కోచింగ్ క్లాస్ లను టైం టేబుల్ (కాల క్రమం ) ప్రకారం బోధించాలని సూచించారు.
ఈ ప్రత్యేక తరగతులకు విద్యార్ధులు అందుబాటులో ఉండే విదంగా అధ్యాపకులు తనని చర్చలు తీసుకోవాలని, ప్రతి శనివారం తప్పని సరిగా విధ్యార్థులకు ఆటలు,క్రీడలు నిర్వహించాలని ఆయన అన్నారు.తాను మరోసారి కళాశాల సందర్శనకు వచ్చేలోపు అడ్మిషన్ పూర్తి స్థాయిలో పెరగాలని ప్రిన్సిపాల్ అధ్యాపకులను ఆదేశించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత, అధ్యాపకులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.