ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు
నవతెలంగాణ – పరకాల : గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యేలా కార్యాచరణ తయారు చేసుకోవాలని ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు సూచించారు. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి అధ్యక్షతన జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాల పరకాలలో సెర్ప్ మహిళా సంఘాల అధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన కన్వర్జెన్స్ సమావేశానికి ఆయన మఖ్య అథిదిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన గదులు, గ్రౌండ్ ,క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు. ఉచితంగా పుస్తకాలు, టిఫిన్, భోజనం, డ్రెస్ లు అందివ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద మైనర్ రిపేర్లు, మరుగుదొడ్లు ,ఎలక్ట్రిసిటీ మొదలగు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిందని, ఈ విషయాలు తల్లి తండ్రులకు తెలియచేసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సి. యం.ఓ బి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మహిళా సంఘాలు సమన్వయం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయం క్రాంతి, మండల నోడల్ అధికారి నామాని సాంబయ్య, జడ్.పి.యస్ యస్ బాలుర ప్రధానోపాధ్యాయులు సురేందర్ , ప్రధానోపాధ్యాయులు జడ్.పి.యస్.యస్ బాలికలు మధు మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES