Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఈడబ్ల్యూఎస్ కు లేని అడ్డంకి.. బీసీ బిల్లుకే వచ్చిందా.?

ఈడబ్ల్యూఎస్ కు లేని అడ్డంకి.. బీసీ బిల్లుకే వచ్చిందా.?

- Advertisement -

పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదించాలి – శ్రీరామ్ రామకృష్ణ ప్రభు 
నవతెలంగాణ – దుబ్బాక 

అగ్రవర్ణ పేదల సాకుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యుఎస్ బిల్లు (10 శాతం రిజర్వేషన్ ) కు లేని అడ్డంకి బీసీ బిల్లు కే వచ్చిందా అని బహుజన లెబరల్ ఫ్రంట్ చైర్మన్ శ్రీరామ్ రామకృష్ణ ప్రభు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లు (42 శాతం రిజర్వేషన్ ) ను ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించాలని కోరుతూ గురువారం దుబ్బాక పట్టణ కేంద్రంలో బహుజన లెబరల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కేంద్ర సర్కార్ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. న్యాయపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, ఆ దిశగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు గడ్డం నందు, ఉపేందర్, కాస్తి శ్రీనివాస్, వెంకట్ చారి, రాజేందర్, సత్యనారాయణ ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img