Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వడ్లు వర్షార్పణం 

వడ్లు వర్షార్పణం 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండలంలోని మొడేగాం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వడ్లు వర్షానికి నీటి లో  కొట్టుక పోయాయి రైతులు తెలిపారు. ఝశనివారం కురిసిన భారీ వర్షానికి వడ్ల నుండి వాన నీరు ప్రవహించడంతో రైతులు ఆందోళన చెందారు. గ్రామకి చెందిన భోయిని సాయిలు యొక్క వడ్లు నీటిలో కొట్టుకొని  పోయినట్టు గ్రామస్తులు తెలిపారు. చేతికి వచ్చిన పంట ఖండ్ల ముందు కొట్టుక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  వరి కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన వడ్లు  కొట్టుకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కష్టపడి పండించి కొనుగోలు కేంద్రాలు ఆరబెడితే భారీ వర్షానికి కొట్టుకుపోవడం జరిగిందని తెలిపారు. వరి కొనుగోలు కేంద్రం పద్మాజివాడి ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం పరిధిలోనిది. వరి ధాన్యం కొట్టుక పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -