నవతెలంగాణ – మల్హర్ రావు
పాత పెన్షన్ సాధన నిరసన కార్యకమాన్ని సెప్టెంబర్ 1న జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టునట్లుగా ఇట్టి కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని కోరుతూ శనివారం మండలంలోని వల్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో భోజన విరామ సమయంలో కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సిపిఎస్ రద్దు విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాటవేత ధోరణితో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా (కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ పక్షన డిమాండ్ చేశారు. దీనిలో భాగంగానే కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పెండెం మధుసూదన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ బాబు, డిటిఏప్ పక్షాన కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సుదర్శన్, ఎస్టియుటిఎస్ పక్షాన రమేష్ నాయక్, పిఆర్టియు పక్షాన తిరుపతిరెడ్డి, టిటియు పక్షాన రఘువీర్ నాయక్, వివిధ సంఘాల మండల బాధ్యులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాత పెన్షన్ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES