హైకోర్టు తీర్పును అమలు చేయాలి
రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నవతెలంగాణ – కంఠేశ్వర్
పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి అని, హైకోర్టు తీర్పు ను అమలు చేయాలి అని 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన స్వగృహంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కలిసి 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా, ఇటీవల హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. మహేష్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ న్యాయమైన డిమాండ్ అని ఖచ్చితంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 2003 పాత పోరాట సమితి నాయకులు అర్గుల సత్యం, సురేందర్, స్వప్న, విజయ్ కుమార్, రామకృష్ణ, గుత్ప ప్రసాద్, గంగాధర్, విట్టల్, మోహన్, మురళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు..
పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES