– జంతర్ మంతర్‌లో ఆందోళన
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా పాత పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతూ నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంఓపీఎస్) ప్రతినిధులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్‌ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో మంగళ వారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులు ఆందోళన చేపట్టారు. ఎన్‌ఎంఓపీఎస్ జాతీయ అధ్యక్షులు వి.కె.బంధు, సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ నాయకత్వంలో నిర్వహిం చిన ఈ ధర్నాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ… కేంద్రం తెచ్చిన నూతన పిన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఎన్‌ఎంఓపీఎస్ అనేక ఏండ్లుగా పోరాడుతోందన్నారు. ఈ పోరాటం ఫలితంగానే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) అమలవుతోందని తెలిపారు. తాజాగా పంజాబ్‌లోనూ పునరుద్ధరించినట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే వోట్ ఫర్ ఓపీఎస్‌తో అధికారంలోకి వచ్చిన తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ ప్రభుత్వాలు వెంటనే పాత పెన్షన్‌ను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -



