Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్పాత పెన్షన్ విధానం వెంటనే పున:రుద్దరించాలి..

పాత పెన్షన్ విధానం వెంటనే పున:రుద్దరించాలి..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని టిఎస్‌ సిపిఎస్‌ఇయు జిల్లా అధ్యక్షులు కాంబ్లే విజయ్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో టీఎస్ సిపిఎస్ఈయూ ఆధ్వర్యంలో గోడ పత్రులను విడుదల చేశారు. ఈ సందర్భంగా టిఎస్‌ సిపిఎస్‌ఇయు జిల్లా అధ్యక్షులు కాంబ్లే విజయ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినం పాటిస్తూ, సంఘం ఆధ్వర్యంలో పాత పెన్షన్ సాధన పోరాట సభ నిర్వహించడం జరుగుతుందని, పెన్షన్ ప్రభుత్వాల దయాధాక్షిణ్యం కారాదు, పెన్షన్ ఉద్యోగి హక్కు -భిక్ష కాదన్నారు.

సెప్టెంబర్ 1 సోమవారం ఉదయం 11గంటలకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు టీజిఈజెఏసి తో కలసి శాంతియుత నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్స్, కార్మికులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమం విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సుకుమార్, అభిలాష్, అనిల్ కుమార్, అశ్విన్, మీనాక్షి, అమోల్, మహేష్, భరత్, హరికిరణ్, ప్రసన్న కుమార్, శ్రీనివాస్, జీవన్, పుండాలిక్, కపిల్, సంతోష్, మహేందర్, చందన్ బాబు, ప్రకాష్, రాజు, కాంతం, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad