Sunday, March 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో కొనసాగుతున్న మారణహోమం

గాజాలో కొనసాగుతున్న మారణహోమం

- Advertisement -

ఇజ్రాయిల్‌ దాడిలో మరో ఏడుగురు మృతి
గాజా :
గాజాలో ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో మరో ఏడుగురు మరణించారు. గత మూడు రోజుల్లో ఇజ్రాయిల్‌ ఈ ఘాతుకానికి పాల్పడింది. శనివారం ఉదయం ఖాన్‌ యూనిస్‌లోని ఒక పోలీసు పోస్ట్‌పై ఇజ్రాయిల్‌ దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో పాలస్తీనాకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. గురువారం ఇద్దరిని, శుక్రవారం మరో ముగ్గురిని ఇజ్రాయిల్‌ దళాలు హత్య చేశాయని గాజా వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత కూడా ఇజ్రాయిల్‌ దళాలు దాడులు చేస్తూనే ఉండటంతో గత ఆరు నెలల్లో 658 మంది మరణించారు. వేలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
గాజాలో ఇసుక తుపాను
గాజాలో ఇసుక తుపాను వీచడంతో శిథిలావస్థలో ఉన్న గుడారాల్లో నివసిస్తున్న కుటుంబాలు నానా అవస్థలు పడ్డాయి. చెల్లా చెదురుగా పడిపోయిన వస్తువులన్నింటినీ తిరిగి తమ గుడారానికి చేర్చుకుంటూ పెద్దలు, పిల్లలు కనిపించారు. రఫా సరిహద్దును ఇజ్రాయిల్‌ మూసివేయడంతో సహాయం అందక ఆకలితో గాజా వాసులు అలమటిస్తున్నారు. ఇజ్రాయిల్‌ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వేలాదిమంది విదేశాలకు చికిత్స కోసం వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. వారిలో పిల్లలే అత్యధికం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -