భారత్‌పై 10 వికెట్లతో గెలుపు
పెర్త్ (ఆస్ట్రేలియా) : భారత మహిళలతో ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా అమ్మాయిలు అదిరే విజయం అందుకున్నారు. బ్యాట్‌తో, బంతితో భారత్‌పై పైచేయి సాధించిన ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 1-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. 25 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఊదేసిన ఆస్ట్రేలియా.. రెడ్‌బాల్‌తో హర్మన్‌ప్రీత్ సేనపై తిరుగులేని ఆధిపత్యం చూపించింది. ఓపెనర్లు జార్జియా వోల్ (16 నాటౌట్, 13 బంతుల్లో 4 ఫోర్లు), లిచ్‌ఫీల్డ్ (11 నాటౌట్, 14 బంతుల్లో 1 ఫోర్) ఛేదనలో రాణించారు. అంతకముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 198 పరుగులే చేయగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్ సుథర్‌లాండ్ (6 వికెట్లు, 129 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.
ఏకైక టెస్టు ఆసీస్‌దే
- Advertisement -
- Advertisement -



